

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి, మార్చి 27, 2025: పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సాయి కుమార్ అనే యువకుడు తన పుట్టినరోజునే దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతనిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి కుమార్ హత్య వార్త తెలియగానే అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. గ్రామంలో భద్రతను పెంచేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.