

పిల్లలమర్రిలో నేడే అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సూర్యాపేట రూరల్(పిల్లలమర్రి) మార్చి 09: ముసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి తెలిపారు.ప్రాచీన ఆలయాలకు పిల్లలమర్రి ప్రసిద్ధి గాంచిందని కాకతీయుల కాలంలో నిర్మించిన మహిమాన్విత ఆలయాలు భక్తులకు ఇక్కడ దర్శనం ఇస్తాయని అన్నారు.121వ బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ముస్తాబు అయిందని దూర ప్రాంతాల నుండి జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అన్నారు.మరింగంటి వరదా చార్యులు యాగ్నికమున ఆలయ ప్రధాన అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించటం జరుగుతాయి అన్నారు.ఈ ఐదు రోజులు పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఉమ్మెంతల హరిప్రసాద్,ఉమ్మెంతల ఆహ్లాద రావు, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ మంగపండ్ల మల్లికార్జున్ కమిటీ సభ్యులు కంధకట్ల రాంబాబు,కుమ్మరికుంట్ల జానయ్య,గంపల శంకర్,సైధమ్మ మల్లయ్య,బంగారి కృష్ణయ్య,కోనేటి కృష్ణ,చెరుకుపల్లి రాజు, అంకం భిక్షం తదితరులు పాల్గొన్నారు..