

పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి
*శాసనసభలో ఎమ్మెల్యే పవా ర్ రామరావు పటేల్*
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 27 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు అదనంగా 18 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ శాసనసభ లో కోరారు. గడువు మూడు నెలలు మాత్రమే ఉందని తక్షణమే జీవో విడుదల చేయలన్నారు. పనులు పూర్తయితే 4200 ఎకరాలకు సాగునీరు అందుతుందని, పిప్రి, మొల, నగర్, ధర్మోరా, బాగాపూర్, రాయపూర్ కాండ్లి, లోకేశ్వరం, నగర్ తండాల తో పాటు, పలు తండాల్లో, సాగునీరు అందుతుందన్నారు. ఎలక్ట్రికల్ పనులు మినహా అన్ని పనులు పూర్తి కావడం జరిగిందని ఇప్పటివరకు ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు చేసిందని తక్షణమే ప్రభుత్వం 18కోట్లు విడుదల చేస్తే తక్కువ ఖర్చుతో రైతాంగానికి ఎక్కువ సాగునీరు అందుతుందన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.