

పార్టీ పదవుల్లో పాతవారికి ప్రాధాన్యత ఇవ్వండి
జిల్లా ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు జంగ్మే చాందరాం
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 07 ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల్లో పాతవారికి సైతం ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగ్మే చందరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసిన కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. ముఖ్యంగా పాతవారికి అన్ని రకాల పార్టీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు టీపీసీసీ అధ్యక్షులకు విన్నవించారు. పదవుల కోసమే పార్టీలు మారే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. తాము చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదని పార్టీ ముఖ్యమని అన్నారు.