

పామ్ ఆయిల్ తోటల సంరక్షణపై సూచనలు –
రైతులకు భరోసా
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ తోటల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి బి. వి. రమణ వేసవి కాలంలో పామ్ ఆయిల్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడంలో బయో రిపెల్ జెల్ ఉపయోగకరమని హైదరాబాద్ జెన్ అగ్రిటెక్ జనరల్ మేనేజర్ శ్రీ లెనిన్ బాబు వివరించారు.రైతులు పంట కోత కోసం ఆందోళన చెందవద్దని త్వరలో ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు బి. వి. రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి శ్రీమతి సాదుల మౌనిక, ప్రీ యూనిక్ కంపెనీ డిజిమ్ మల్లేశ్వర్ రావు, ఏరియా మేనేజర్ వనోజ్, క్లస్టర్ ఆఫీసర్లు కృష్ణ రెడ్డి, ప్రశాంత్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్, నిర్మల్, నర్సాపూర్ మండలాల నుండి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.