

పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాల, సరస్వతీ శిశు మందిర్, శ్రీ అక్షర పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తుగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముందుగా కామ దానం నిర్వహించి అనంతరం హోలీ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల రంగులను ఆనందంతో చల్లుకున్నారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందోత్సవాలను తీసుకురావాలని పాఠశాలల ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రబింద్రా పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్రావు దేశాయ్, శిశు మందిర్ ప్రధానాచార్యులు సారథి రాజు, శ్రీ అక్షర డైరెక్టర్ సుభాష్ పాటిల్, లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపల్ నజీబ్ ఖాన్, కరస్పాండెంట్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు