పవిత్ర భార్య భర్తల బంధాలను కాపాడండి, తమ సంతానానికి మంచి సందేశం, మంచి భవిష్యత్తు ఇవ్వండిఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 04 /ఎన్ హెచ్ ఆర్ సి. పెన్ చాట్: స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని ఒక వేద వాక్కు. స్త్రీలను దేవతల రూపాలుగా భావించే మనదేశంలో ఈ మధ్యకాలంలో కామాంధులైన మహిళలు తమ భర్తలను చంపడానికి, చంపించడానికి వెనకాడడం లేదని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి గుండాలతో సుఫారీలు ఇచ్చి హత్యలు చేయిస్తున్నారు. బాగా తిని బలిసి కన్ను మిన్ను గానకుండా సాంప్రదాయాలను గాలికి వదిలేసి తాళిబొట్టును ఎగతాళి బొట్టుగా భావించి కట్టుకున్నోడిని కాదని చంపిస్తున్నారు. తమ అక్రమ సంబంధాలకు అడ్డు లేకుండా చేసుకుంటున్నారు. కాలం తెచ్చిన మార్పుతో అగ్నిసాక్షిగా ఏడు అడుగుల వివాహ బంధం, పెళ్లి అంటే నూరేళ్ల పంటగా అర్ధనారీగా, అర్ధనారీశ్వరుడుగా జీవితాంతం ఒకరికొకరు తోడుంటే భార్యాభర్తల దాంపత్య బంధమే పవిత్ర దైవబంధం అనే విషయాన్ని మరిచిపోయి విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, నాగరికతను ధ్వంసం చేస్తున్నారు. పరాయి పురుషుల వ్యామోహములో పడి కట్టుకున్న భర్తను, కడుపులో పుట్టిన బిడ్డలను వదిలేసుకుంటూ భర్తలను చంపించే దుర్మార్గ చర్యలకు పాల్పడే వారిని సమాజం బహిష్కరించాలని కోరుతున్నాం. సినిమా, టీవీల పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉండాలని. కుటుంబ విలువలను తెలుసుకుంటూ బాధ్యతతో ప్రవర్తించాలని మానవ మహిళా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము. పవిత్రమైన భార్య భర్తల బంధాన్ని కాపాడాలని, తమ సంతానానికి మంచి సందేశం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ విషయంలో మహిళా మేధావులు, మహిళా సంఘాల నాయకులు, వివిధ రకాల మహిళా ప్రతినిధులు ప్రస్తుత కాలంలో జరుగుతున్న దుశ్చర్యలను ఖండిస్తూ భార్యాభర్తల బంధాలను పటిష్ట పరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, చైతన్యం తేవాలని కోరుతున్నాము