

పన్ను చెల్లించకుంటే చర్యలు తప్పవు.
మురళికృష్ణ, మున్సిపల్ కమీషనర్ చెన్నూరు.
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. 24 – మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఆస్థి పన్ను చెల్లించని వారెంతవారైనా మున్సిపల్ చట్టం ప్రకారమే చర్యలు తప్పవని చెన్నూరు మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణ అన్నారు. సోమవారం రోజున చెన్నూరు మున్సిపల్ పరిధిలో గల ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం మరియు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆయన తాళాలు వేశారు. దాదాపు 8 ఏళ్లుగా ఎఫ్డీవో కార్యాలయం 3లక్షల 43వేల రూపాయలు, ఎఫ్ఆర్వో కార్యాలయం 70వేలకు మేర ఆస్థి పన్ను కట్టకుండా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇటీవలే పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ అధికారులు స్పందించలేదని, అందువల్లనే నేడు ఇరు కార్యాలయాలకు తళాలు వేసినట్లు ఆయన తెలిపారు. గత మున్సిపల్ అధికారుల అలసత్వం కారణంగానే ఇలాంటి మొండి బకాయిలు కోటి రూపాయలకు మేర మున్సిపాలిటీకి రావాల్సి ఉందని, మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా ఆస్థి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం వహించేవారిపై నిబంధనలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని, కావున ప్రజలంతా సకాలంలో ఆస్థి పన్ను చెల్లించి తమకు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మురళీకృష్ణ పట్టణ వాసులను కోరారు