

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 23 – నిజామాబాద్ జిల్లా కేంద్రం లో తుల్జా భవాని మాత ఆలయంలో.. తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు.. మరాఠీ గొందళ్ ( మరాఠీ ఒగ్గు కథ ) నాందేడ్ బృందం వారిచే నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా.. ఒగ్గు కథ నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ.. ఎన్నడు లేని విధంగా నిజామాబాద్ పట్టణంలో తుల్జా భవాని ఆలయ సన్నిధానంలో.. మరాఠీ ఒగ్గు కథ నిర్వహించడం జరిగిందని.. తద్వారా అమ్మవారి చరిత్ర.. మరియు మానవ జీవనశైలి విధానం.. ప్రజలు తెలుసుకున్నారని.. ఒగ్గు కథ సారాంశం.. తుల్జా భవాని అమ్మవారిని కీర్తిస్తూ.. కొనసాగే ఈ కార్యక్రమం దాదాపు మూడు గంటలు ఉంటుంది.. ఈ మూడు గంటల సందర్భంలో. సంతానం లేని వారు.. గృహ నిర్మాణ విషయంలో.. సంసార సానుకూలత లేని వారు.. కుటుంబ కలహాలు రూపుమాపే దశలో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని… ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. కార్యనిర్వాహకురాలు పద్మ.. దంపతులతో పాటు.. ఆలయ నిర్వాహకులు పోలాస సత్యనారాయణ భాగ్యశ్రీ.. మరియు ఆలయ భక్త బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు