పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి పంచముఖి ఆంజనేయ ఆలయ కమిటీ సన్మానం
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో గత నెల ఉపాధ్యాయ పదవీ విరమణ పొందిన జిల్లెల్ల విలాస్ గౌడ్‌ను సోమవారం సాయంత్రం ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. పంచముఖి హనుమాన్ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విలాస్ గౌడ్‌ను కొనియాడుతూ, ఆయన విద్యారంగంలో అందించిన సేవలను గుర్తు చేశారు. 38 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి విలాస్ గౌడ్ అని తెలిపారు. అలాగే, ఆయన ఆలయ అభివృద్ధికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా విశేషంగా సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ సందర్భంగా విలాస్ గౌడ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా పంచముఖి హనుమాన్ ఆలయం, రామాలయం, శివాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యతగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచముఖి హనుమాన్ ఆలయ పంతులు ఘన్షం దేశ్‌ముఖ్ శర్మ, దిలీప్ దేశ్‌ముఖ్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు