

పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మనొరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసలి పట్టు కృషి మేళా ను ప్రారంభించారు. ఈ సందర్భంగా
తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల కు చెందిన పలు రకాల పట్టు వస్త్రాలను మరియు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అధిక లాభాలను ఇచ్చే పరికరాలను ప్రదర్శనలో ఉంచారు.
జాతీయ గీతాలాపన అనంతరం పట్టు రైతుల కోసం రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు..
గత నలభై సంవత్సరాల నుంచి పట్టు పరిశ్రమలో సేవలందించిన పలువురు పట్టు రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు..
ఈ కార్యక్రమం లో కేంద్ర, రాష్ట్ర సిల్క్ బోర్డు అధికారులు, పట్టు రైతులు పాల్గొన్నారు..