పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ

పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తప్పు చేసినవారిని వదిలేది లేదు

రెడ్​బుక్ దాని పని అది చేస్తుంది: మంత్రి లోకేశ్

మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం​లో పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ

పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

గుంటూరు నుంచి మనోరంజని ప్రత్యేక ప్రతినిధి : రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతోందని మంత్రి నారా లోకేశ్​ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాతూ ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతీ ఎన్నికలో విజయం కూటమిదేనని మంత్రి ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కనీవిని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత మనదేనని వెల్లడించారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షహోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగుళూరు వెళ్లిపోతాడని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్​గా మారాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్సార్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని లోకేశ్​ గుర్తు చేశారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొనియడారు. పింఛన్ పెంచినా, అన్న క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు. యువత గెలిపించిన గెలుపు ఇది అని స్పష్టం చేశారు. మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేశ్​ ప్రకటించారు.

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు