

పంచగూడి గ్రామ సేవకుడు కుటుంబానికి ఆర్థిక సాయం
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం వాటోలి గ్రామానికి చెందిన పంచగూడి గ్రామ సేవకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు సోమవారం గ్రామ విడిసి సభ్యులు రూ.6,000, హెల్పింగ్ హాండ్స్ సభ్యులు రూ.24,100 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జి.గంగాధర్, బి.యోగేష్, పిరుపాటిల్, శంకర్ పాటిల్, వై.గంగాధర్, ప్రతాప్ రెడ్డి, భోజప్పా పాటిల్, ఆనందరావు, ఇంద్రకరణ్ గౌడ్, గ్రామస్తులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి భరోసా కల్పించేందుకు స్థానికులు ముందుకు రావడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.