న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

-ఈ న్యాయం అంటే ఏమిటి…?

-డా. మొగుల్ల భద్రయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC)

కామన్ మాన్ వాయిస్: మనోరంజని ప్రతినిధి మార్చి 23 – ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని బలమైన అభిప్రాయం ఉంది. దేశ పౌరులకు న్యాయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలని కోరుకునే హక్కు ఉంది. ఢిల్లీలో హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో వేల కోట్ల రూపాయల నగదు దొరికిందన్న వార్త న్యాయవ్యవస్థపై మరోసారి సంచలనం సృష్టించింది. ఈ విషయం నిజమే అయితే, ఆ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత ఇచ్చి, నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. నిజంగా ఆయన ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దొరికినట్లయితే, అతనికి ఏ శిక్ష విధించబడుతుందో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది అంతర్గత వ్యవహారమని భావించడం కంటే, న్యాయవ్యవస్థ పేరు మాయని మచ్చ పడకుండా చర్యలు తీసుకోవడం అవసరం. అక్రమంగా వచ్చి లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు వాస్తవాలను బయటికితీసి నేరస్తులను సమాజంలో దోషులుగా చూపించే ప్రవర్తన విభాగం (ED) మరియు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు సరైన సమాచారం, సమాధానం ఇవ్వాలని, నగదు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా అందింది? అనే విషయాలను భారత సమాజానికి స్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?