

నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 – TG: తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది