

నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు
మనోరంజని ప్రతినిధి మార్చి 11 -నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ : టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశానవాటికలో అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గరిమెళ్ల ఇద్దరు కుమారులు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉ.10.30 గంటలకు భవానీనగర్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు