నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అయితే, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది,రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభా వంతో రానున్న రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గి వాతావ రణం చల్లబడుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవ కాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. ఇదిలాఉంటే.. ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు.. వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది

  • Related Posts

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల…

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా! -ఈ న్యాయం అంటే ఏమిటి…? -డా. మొగుల్ల భద్రయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) కామన్ మాన్ వాయిస్: మనోరంజని ప్రతినిధి మార్చి 23 – ఇటీవలి కాలంలో మన న్యాయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!