

నేడు డబుల్ ధమాక
హైదరాబాద్‌తో రాజస్థాన్ ఢీ…
చెన్నై- ముంబై బోణి కోసం పోరాటం
కలం నిఘా: న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:మార్చి 23
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యా హ్నం 3:30 గంటల సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలి చిన హైదరాబాద్.. ఈ ఏడాది అదే జోరు కొనసా గించేందుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగు జట్లకు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ కావడంతో గెలుపు సాధించాలని భావిస్తున్నా యి. న్‌రైజర్స్ శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరు తోంది. కొత్త సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో సీజన్‌ను ప్రారంభిస్తున్న రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లోనే కఠినమైన పరీక్షకు సిద్ధమైంది. పటిష్టమైన సన్‌రైజర్స్ రూపంలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోనుంది. ఓపెనర్లు నిలిస్తే తుఫానే గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క సీజన్‌లోనే మూడు సార్లు 250 పైగా స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్య ధిక స్కోరు (287/3)తో సరికొత్త చరిత్ర సృష్టిం చింది. పవర్ ప్లేలో అత్య ధిక పరుగుల (125/0) రికార్డునూ సొంతం చేసుకుంది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిలతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. స్పిన్నర్ హసరంగ, పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. రాజస్థాన్‌పై SRHదే పై చేయి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు జట్లు 20 సార్లు తలప డ్డాయి. అందులో హైదరాబాద్ 11 సార్లు, రాజస్తాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అలాగే, ఉప్పల్ స్టేడియంలో RRపై హైదరా బాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో ఇక్కడ జరిగితే నాలుగింట గెలిచింది. దీంతో ఈ రోజు కూడా రాజస్థాన్‌ను చిత్తుచేసి బోణీ కొట్టడం ఖాయమంటున్నారు అభిమానులు