నేటి రాశి ఫలాలు

24.03.2025
నేటి రాశి ఫలాలు

🐐 మేషం
24-03-2025)

మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. నవమంలో చంద్రుడు అనుకూలించట్లేదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. శ్రీశివపార్వతులను పూజించడం మంచిది.

🐂 వృషభం
24-03-2025)

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యానికి పరిరక్షించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దేహజాఢ్యాన్ని రానీయకండి. దుర్గారాధన మేలు చేస్తుంది.

💑 మిధునం
24-03-2025)

మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో స్పష్టంగా ఉండటమే మేలు.
శివ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

🦀 కర్కాటకం
24-03-2025)

ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

🦁 సింహం
24-03-2025)

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. వ్యాపారంలో అనుకూలత ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

💃 కన్య
24-03-2025)

మనఃస్సౌఖ్యం ఉంది. వ్యాపారులకు శుభకాలం. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చతుర్థ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గాస్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

⚖ తుల
24-03-2025)

శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

🦂 వృశ్చికం
24-03-2025)

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

🏹 ధనుస్సు
24-03-2025)

ప్రారంభించిన పనులలో విజయాలను అందుకుంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శని ధ్యానం శుభప్రదం.

🐊 మకరం
24-03-2025)

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అలసట పెరుగుతుంది. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. చంద్రశేఖర అష్టకం చదవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

🏺 కుంభం
24-03-2025)

ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభప్రదం.

🦈 మీనం
24-03-2025)

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి శ్రీవేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

  • Related Posts

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు మేషం వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత…

    నేటి రాశి ఫలాలు🗓

    నేటి రాశి ఫలాలు🗓🐐 మేషం17-03-2025) మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. సప్తమ చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    దేవాలయాల భూములను పరిరక్షించండి

    దేవాలయాల భూములను పరిరక్షించండి

    అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్

    అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్