

నెక్ట్స్ అరెస్టు కొడాలి నాని?
AP: వైసీపీ నేత కొడాలి నానిని అరెస్టు చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని, వాసుదేవరెడ్డి, మాధవీలత రెడ్డే కారణమని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నానితో సహా నిందితులపై పోలీసులు 448, 427, 506 RW 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, నానికి ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తోందట.