

నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం….
మనోరంజని , ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28,:-బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలం సాలూర క్యాంపు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజున రైతులు సాగునీరు అందక రైతుల ఆందోళన చేపట్టారు. సాలూర , సాలూర క్యాంపు , జాడి జామలాపూర్ , ఫతేపూర్ గ్రామాల రైతులు శ సాలుర క్యాంపు గ్రామపంచాయతీ భవనములో నీటి పారుదల శాఖ అధికారులను రైతులు తాళం వేసి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పంటలకు నిజాంసాగర్ డి 28 కాలువ ద్వారా నీటిని అధికారులు సకాలంలో అందించలేక పోతున్నారని, ఇందువల్ల పంటలు ఎండిపోతున్నాయని , రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మరియు అధికారులతో మాట్లాడారు . అనంతరం ఇరిగేషన్ అధికారులు పోలీసు బందోబస్తుతో పెంటకూడదు రైకూర్ , ఫారం కెనాల్ ను పరిశీలించారు.