నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకం
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 01 :-నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంబరి సౌమ్య నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. యువతకు పార్టీలో సబలమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు తనవంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు. ఎంబరి గంగాధర్ మాట్లాడుతూ, "ఎంబరి సౌమ్య నియామకం యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె కీలకంగా పనిచేస్తారని భావిస్తున్నాం" అని అన్నారు.
నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, ప్రజలకు పార్టీ విధానాలను చేరవేయడానికి కొత్త నాయకత్వం అందించనుంది. పార్టీ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు