నిర్మల్ జిల్లా మజీద్ లలో రంజాన్ సమయ పట్టికల పంపిణీ
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 01 :-పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం కావడం సందర్భంగా ఎన్. హెచ్. ఆర్.సి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మజీద్ లలో ఉపవాస సమయ పట్టికలను ఎన్. హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు ఎం.ఏ వకిల్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ పట్టికల ద్వారా ముస్లింలకు సొహూర్ (ఉదయపు ఉపవాస ప్రారంభ సమయం), ఇఫ్తార్ (సాయంత్రం ఉపవాస విరమణ సమయం), నమాజ్ సమయాలు, ఇతర విశేషాలు అందించారని నిర్వాహకులు తెలిపారు. ఎన్. హెచ్. ఆర్.సి ప్రతినిధులు, మజీద్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ నెలలో ఉపవాసాలు ఆచరించడం, ప్రార్థనలు నిర్వహించడం ముస్లిం సమాజంలో విశేష ప్రాముఖ్యత కలిగినదని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా మతపరమైన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు