

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని దోభి గల్లి, జైశ్రీరామ్ కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి కొరత కారణంగా కాలనీ వాసులు రాత్రి 3 గంటల వరకు నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలనీ వాసులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నీటి సమస్యతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
