నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడిస్తేనే విజయాలు వరిస్తాయి :

నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడిస్తేనే విజయాలు వరిస్తాయి :

ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ :

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 11 :- ఉట్నూర్ : జీవితంలో నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడుస్తూ గమ్యాన్ని చేరుకునేలా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ మరియు విద్యార్థులకు వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు,జనరల్ స్టడీస్,సాధారణ గణితం, ఇంగ్లీషు,రీజనింగ్ అనే అంశాలపై నిర్వహించిన 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా సాధన చేయాలన్నారు.ఎన్ని ఒడుదుడుకులు వచ్చిన చదువును మధ్యలో ఆపకుండా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు వరించాలంటే సరైన మార్గదర్శకత్వంలో నడవాలని పిలుపునిచ్చారు.వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్,వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి ప్రసాద్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా.ఎం.నర్సింగ్ రావు,చంద్రశేఖర్,డా.రాణి, కరుణాకర్, శ్రీకాంత్,రాజశేఖర్,డా.రవీందర్,రాజ్ కుమార్,డా.కిషన్,తిరుపతి,డా. శ్రీనివాస్,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం షాద్ నగర్ గంజ్ లో రాత్రి 11 గంటలకు కాముడి దహనం భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ…

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం