

నిజామాబాద్‌లో శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 01 :- నిజామాబాద్ జిల్లా శివాజీ నగర్ రామకృష్ణ కుటీర్, గంగా స్థానం రామకృష్ణ మఠంలో శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞ హవనాలు నిర్వహించి, శ్రీ రామకృష్ణ పరమహంసకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా శివాజీ నగర్ రామకృష్ణ కుటీర్ నిర్వాహకులు ఎస్.ఎన్. చారి మాట్లాడుతూ – “ప్రతి విద్యార్థి రామకృష్ణ బాటలో నడవాలి. నిజాయితీ, ధర్మం, విధేయతతో జీవించాలి” అని సూచించారు. రామకృష్ణ పరమహంస ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు అని తెలిపారు. ఈ వేడుకల్లో శశిరేఖ శ్రీనివాస్, మధు మాధురి, కృష్ణవేణితో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల నినాదాలతో మఠం పరిసరాలు భక్తిమయంగా మారాయి