

నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ
మనోరజని ప్రతినిధి వేములవాడ మార్చి 14 – రెండు దొంగతనాల కేసులో నిందితునికి 8 నెలల శిక్షతోపాటు రూ. 100 జరిమానా విధించినట్టు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం. రెండు వేరువేరు సెల్ఫోన్ దొంగతనాల కేసులో నిందితుడు ఇర్ఫాన్ కు 08 నెలల జైలు శిక్షతోపాటు రూ. 100 జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి గురువారం తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు