

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
మనోరంజని ప్రతినిధి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులకు ఔట్ అయ్యారు. 29వ ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర వేసిన రెండో బంతికి క్యాచ్ ఇచ్చి అక్షర్ పెవిలియన్ చేరాడు. దీంతో 29.2ఓవర్లకి టీమిండియా స్కోర్ 128/4 గా ఉంది. కాగా, శ్రేయాస్ అయ్యర్- అక్షర్ పటేల్ 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది