

నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’
మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 – నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను సోమవారం బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేసేందుకు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ సంతోష్, కాంగ్రెస్ యువనాయకుడు రాథోడ్ కార్తీక్, జాదవ్ రోహిదాస్ తదితరులున్నారు