

నర్సాపూర్ (జి) పోలిస్ స్టేషన్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐ.పి.ఎస్
మనోరంజని ప్రతినిధి
నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 28
జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐ.పి.ఎస్ నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్.ఐ లు ఎస్పీ కి వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ల కు చేరుకున్న జిల్లా ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్లో తీవ్రమైన నేరాల సి.డి ఫైల్స్, స్థిరాస్థి చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో కల నేర ప్రవృత్తి కల వారిని ప్రతి రోజు తనిఖీ చేయాలని, అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని సిబ్బంది అంకితభావంతో విదులు నిర్వర్తించాలని కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు.అలాగే ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియామాలు పాటించాలని తాగి వాహనాలు నడపవద్దని అన్నారు. అలాగే బ్లూ కోట్స్, పెట్రోల్ కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ స్టేషన్ అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్ , నిర్మల్ గ్రామీణ సీఐ కృష్ణ, నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి కిరణ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
