నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, నష్టపోయిన పంటలు పరిశీలించి వారానికి లోపు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని, అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?