

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 24 ఈ- కార్యక్రమం కన్నుల విందుగా.. వైభవో పేతంగా.. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు హనుమంతుడే ప్రత్యక్షమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా.. ఆనందమయంగా జరిగిన ఈ కార్యక్రమం.. హనుమాన్ భక్తులకు ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు.. మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ వేణు మాట్లాడుతూ.. పురాతన ఆలయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని సోదర భావాన్ని నింపుతున్నాయని.. రాబోయే హనుమాన్ జయంతి శ్రీరామనవమి కూడా ఇలాగే ఆనందోబ్రహ్మంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ వేణు.. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం బ్రహ్మపురి నిజాంబాద్ కి సంబంధించి అధ్యక్షులు గాదెవారి ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి శివరాత్రి సంతోష్ కోశాధికారి కొండ రవీందర్.. తో పాటు.. కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
