ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు..

ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు..

శ్రీరాముని శోభాయాత్రలో ముస్లిం యువకుల చలివేంద్రం..

ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తుల దాహం తీర్చేందుకు ఏర్పాటు..

మతసామరస్యాన్ని చాటిన శ్రీరామ శోభాయాత్ర..

అభినందనలు అందుకుంటున్న యువకులు..

రఘుపతి రాఘవ రాజారాం.. పతీత భావన సీతారాం.. ఈశ్వర్ అల్లా తేరే నామ్.. సబ్కో సమ్మతి దే భగవాన్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ మాట.. కులం ఏదైనా, మతం ఏదైనా, దైవాలు వేరైనా.. మనసులోని అభిమానం ఒక్కటే.. ఏ పేరుతో పూజించిన దేవుడు అందరికీ ఒక్కడే.. ఈ నిజాన్ని చాటుతూ, ఒక అడుగు ముందుకు దాటుతూ ముస్లిం యువకులు షాద్ నగర్ పట్టణంలో ఆదర్శాన్ని చాటారు. భక్తుల దాహాన్ని తెచ్చి తమ అభిమతాన్ని చాటారు. షాద్ నగర్ పట్టణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూ వాహిని, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయితే ముస్లిం యువకులు అక్రమ్ అజహార్, లడ్డు, హాజీ, పర్వేస్, అబ్దుల్ తదితరులు ఈ శోభాయాత్రకు మద్దతుగా నిలవడమే కాకుండా శోభాయాత్ర చేస్తున్న భక్తుల కోసం తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. జైశ్రీరామ్.. అన్న నినాదాలతో సాగుతున్న భక్తులకు గొంతు తడిపారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలలో వివాదాలను ఊహించుకొని బందోబస్తు ఏర్పాటు చేసే పోలీసులు సైతం ముస్లిం యువకుల ఆదర్శాన్ని చూసి ఆశ్చర్య పోయారు. వారిని అభినందించారు. మరోవైపు హిందూ యువకులు కూడా ముస్లిం యువకుల వద్ద దాహం తీర్చుకొని వారి సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మతవిద్వేషాలకు దూరంగా మతసామరస్యానికి దగ్గరగా కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఎంతగానో అలరించింది.

  • Related Posts

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 12 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం పరిధిలోని బెంబర్ గ్రామంలో ఏప్రిల్ 12న అఖండ హరినామ సప్తాహం ఆరంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమిష్టిగా నిర్వహిస్తున్నారు.…

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శనివారం హనుమత్ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ