

ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం
షాద్ నగర్ గంజ్ లో రాత్రి 11 గంటలకు కాముడి దహనం
భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి, నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గంజ్ లో మార్వాడిల ఆధ్వర్యంలో కామ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భరత్ లాహోటి తెలిపారు. రాత్రి 11 గంటలకు శాస్ట్రోక్తంగా వేడుకను నిర్వహిస్తామని వారు తెలియజేశారు. కామ దహనం కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది. ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు, ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు, అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది. ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు. హోలీ జరుపుకునే ముందు రాత్రి కాముడిని దహనం చేయడం ఆనవాయితీ