

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 29 – ధర్పల్లి మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి బాల వికాస్ తల్లిదండ్రుల సమావేశంలో “మహిళా విభాగం వారి పాత్ర” అనే అంశంపై చర్చించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బాల వికాస్ ఇన్‌చార్జి డాక్టర్ మంజుల మాట్లాడుతూ, పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మాటలు చెప్పడం మాత్రమే కాకుండా, వారే స్వయంగా మంచి ప్రవర్తన పాటించాలి. పిల్లలు మాటలు కన్నా, తల్లిదండ్రుల ఆచరణను ఎక్కువగా గ్రహిస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జి పుష్పలత, బాల వికాస్ డిస్టిక్ జాయింట్ కోఆర్డినేటర్ శోభ, యూత్ కోఆర్డినేటర్ వనిత, జాయింట్ కోఆర్డినేటర్ జ్యోతి, సమితి మహిళా కన్వీనర్ కృష్ణవేణి, మంతెన లక్ష్మి, పిండి మమత, సత్యసాయి ప్రతినిధులు చిలుక శంకర్, మచ్చ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
