ద్విచక్రవాహనం చెట్టుకు "డీ" కొని ఒకరికి తీవ్రగాయాలు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :-
నిర్మల్ జిల్లా - సారంగాపూర్: మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదాలలో ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ మండలం తాంసి గ్రామానికి చెందిన బరుకుంట బాబు(40) అనుమతాడు గురువారం ద్విచక్ర వాహనంపై గోపాల్ పేట్ గ్రామానికి తన అత్తగారింటికి వెళ్లి తిరిగి వెళుతుండగా గోపాల్ పేట్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు "డీ" కొన్నాడు ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.