

దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’
భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని రాష్ట్రాల్లో 4.69 లక్షల 5G మొబైల్ టవర్స్ ఏర్పాటు అయినట్లు పేర్కొన్నది. భారతదేశంలో టెల్ కమ్ రంగం అభివృద్ధి చెందుతోందనడంలో ఇది నిదర్శనం అని తెలిపింది.