

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపు..!!
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ముందుగా దేశ ప్రజలకు ఉగాది(Ugadi 2025) పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వసంత కాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందన్నారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని వారు కోరుకున్నారు