

దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 – తన పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే, తన ముక్కు నేలకు రాస్తా అని రేవంత్, భట్టికి సవాల్ విసిరారు. ఏ ఊరికి పోదాం అన్న తాను రెడీ అని రుణమాఫీ చేసినట్లు దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు