

దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. యూపీఐ సేవలందించే గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్స్ పనిచేయడం లేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.