

దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం
12.9కి.మీ. కేదార్నాథ్ రోప్వేకు కేంద్రం ఆమోదం
ఉత్తరాఖండ్ :మనోరంజని ప్రతినిధి
చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ కు వెళ్లేందుకు భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రూ.4,081 కోట్లతో రోప్ వే నిర్మించేందుకు పీఎం మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 12.9కి.మీ. మేర రోప్వే వల్ల ఓ వైపునకు 8-9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36నిమిషాలకు తగ్గిపోనుంది. రోప్ వే నిర్మాణంలో ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ (3S) ఉపయోగించనున్నారు.