దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..
*ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ :- మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు ఆదివారం ఆలయంలో నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాబోయే రోజులలో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తుకారాం రెడ్డి కారుకొండ మాజీ ఎంపిటిసి మిద్దె మల్లేష్ నాయకులు శ్రీను తో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు