

| దుర్వాసన బాబోయ్ వివరితమైన దుర్వాసన |
పాపిష్టి కూడు తింటున్న రసాయన కర్మాగారాలు, యజమానులు
మనోరంజని ప్రతినిధి జగయ్యపేట మార్చి 10 – జగ్గయ్యపేట పట్టణం పరిధిలోనీ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతం నుండి తెల్లవారక ముందు నుండే విపరీతమైన దుర్వాసన రసాయన కర్మాగారాల నుండి విడుదల అవుతుంది అని జాతీయ రహదారి మీద ప్రయాణించే వాహనదారులు, సాయి నగర్,ఆర్టీసీ కాలని , శాంతి నగర్ ,ఉదయం నడక సాగిస్తున్న ప్రజలు రసాయన కర్మాగారాల నిర్వాహకులపై మండి పడుతున్నారు ..కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా ఓ సారి ఆకస్మికంగా ఈ ప్రాంతం లో నడక సాగిస్తే ఆ తరుణం లో ప్రజలు బాధలు వారికి తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమీప ప్రాంతాల ప్రజలు తెల్లవారుజామున ఇంటి తలుపు తీయకుండానే ఇంట్లోకి కూడా రసాయనాలు వాసన గుప్పున వెదజల్లుతోంది అని ఆ పాపిష్టి రసాయన కర్మాగారాలు , యజమానులు కుటుంబాల పై శాపనార్థాలు పెడుతున్నారు