

తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
సూర్యాపేట (D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు.
తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.