తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రం, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తునే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే “తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ బీజేపీలో కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు” అని పేర్కొన్నారు.