తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థా నం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవ డం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు గతంలో స్పందించారు. శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే.. చెల్లు బాటు కావని స్పష్టమైంది. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, మాజీ మంత్రులను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. దీంతో తాజాగా టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలిం చింది. మిత్ర, సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదనుకుంది. బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతి స్తారు. ఒక సిఫార్సు లేఖపై ఆరుగురికే అవకాశం ఉండ నుంది, టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. టిటిడి బోర్డు తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదా లు తెలియజేశారు

  • Related Posts

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 17 ఈ నెల12వ తేది నుండి వారం రోజులపాటుగా వైభవంగా జరుగుతున్న వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు పలు ప్రత్యేక…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    వేములవాడ రాజన్న కళ్యాణం మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా… మనోరంజని ప్రతినిధి వేములవాడ :- మార్చి 16 :- ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీపార్వతీ రాజరాజేశ్వర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్