

తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం
మనోరంజని ప్రతినిధి భీమారం మార్చి 18 :- భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 130వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 16వ ర్యాంకుతో ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం సాధించాడు. ఆయన తండ్రి యాసం రాజమల్లు, తల్లి జక్కమ్మ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ విఫలమైనా పట్టుదలతో చదివి ఈ విజయాన్ని సాధించాడు. శ్రీనివాస్ సోదరుడు యాసం రమేష్ 2017 డీఎస్సీలో ఎస్‌జీటీ (స్కూల్ అసిస్టెంట్) టీచర్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు.