తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా.. ఈరోజు ఫలితాలను రిలీజ్ చేసింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈ పోస్టుల కోసం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్‌-3లో టాప్‌ ర్యాంకర్‌(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్‌-3లో మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ -2 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లోనే గ్రూప్ 1 మెయిన్ ఫలితాలు, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఈ మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ – 1 ఫలితాలను మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే గ్రూప్ -2 ఫలితాలను కూడా విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఈనెల 11న గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్‌కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు ఫైనల్‌ కీ కూడా విడుదలైంది.

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్ మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం