

తెలంగాణ అప్పు ఎంతంటే?
TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక వివరాలను కేంద్రం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణకు మొత్తం రూ. 4,42,298 కోట్ల అప్పు ఉందని, అప్పుల విషయంలో దేశంలో టీజీ 24వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత ఆరు సంవత్సరాలలో 10,189 ఐటీ కంపెనీలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఐటీ రంగం విస్తరిస్తున్నప్పటికీ, 3,369 సంస్థలు నష్టాల్లోకి వెళ్లి మూతపడినట్లు వెల్లడించారు