

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు?
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 07 తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ ఇద్దరు ఐజీలు ఇద్దరు డిఐజీలు ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి, ఈరోజు మధ్యా హ్నం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీ లకు సైతం స్థాన చలనం కల్పించింది ప్రభుత్వం. మిగిలిన 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఐపీఎస్లు..
రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయిచైతన్య
కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
భువనగిరి డీసీపీగా అక్షాన్ష్ యాదవ్
సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
మంచిర్యాల డీసీపీగా భాస్కర్
పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
సూర్యాపేట ఎస్పీగా నరసింహ
సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
సీఐడీ ఎస్పీగా పి.రవీందర్
SIB ఎస్పీగా వై.సాయిశేఖర్
అడిషనల్ డీజీపీగా అనిల్‌కుమార్
ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన